బీఎల్వోల‌ ఫోన్ నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించండి

– ‘ఈసీఐనెట్‌లో బుక్-ఎ-కాల్ విత్ బీఎల్ఓ’ను ప్రోత్సహించండి
– ఓటరు మ్యాపింగ్‌, ధ్రువీకరణ మెరుగుదలకు చర్యలు
– సీఈవో సువ‌ర్శన్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: బూత్ లెవల్ అధికారుల (బీఎల్ వోలు) ఫోన్ నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుద‌ర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం ఈసీఐనెట్ వేదికపై అందుబాటులో ఉన్న ‘బుక్-ఎ-కాల్స్ విత్ బీఎల్ఓ’ సౌకర్యాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సౌకర్యం ద్వారా ఓటర్లు తమకు సంబంధించిన బీఎల్‌వోల‌ను నేరుగా సంప్రదించి ఓటరు వివరాల్లో సవరణలు, ధ్రువీకరణ చేసుకునే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. బీఎల్ఓల ఫోన్ నంబర్లలో మార్పులు జరిగితే వాటిని వెంటనే ఈఆర్వో నెట్ ప్లాట్‌ఫాంలో నవీకరించాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌, అన్ని జిల్లాల‌ కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో అమలుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొన్న సీఈవో, ఓటర్లు సులభంగా బీఎల్ఓలతో సంప్రదించి కాల్ బుక్ చేసుకునేలా ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనన్నారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణల నేపథ్యంలో, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం పెంపొందించడంతోపాటు ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడమే ఈ చర్యల లక్ష్యమని ఎన్నికల సంఘం భావిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *