– అందజేసిన సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగీతంలో శిక్షణ పొందిన అంధ విద్యార్థులు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనను మంగళవారం కలిసి ఆయన ఎదుట పాట పాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లు ఆ విద్యార్థులను అభినందించి వారు పాడిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సంగీత వాయిద్య పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





