స్టీల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు : ఒకరి మృతి

మెదక్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15:‌ మెదక్‌ ‌జిల్లా మనోహరాబాద్‌ ‌మండలం చెట్లగౌరారంలోని ఎంఎస్‌ ‌స్టీల్‌ ‌పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులు, గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *