ఉద్రిక్తంగా బీజేపీ అసెంబ్లీ ముట్టడి

– పోలీసుల కళ్లుగప్పి ఆటోలో వెళ్లిన రామచందర్ రావు
– అసెంబ్లీ గేటు వద్ద నిరసన

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: కాంగ్రెస్ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ అసెంబ్లీ ముట్టడికి సోమవారం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందంటూ కాషాయ సేన గర్జించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సామాన్యుడిలా అసెంబ్లీకి ఆటోలో వెళ్లారు. కాంగ్రెస్ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ నిరసన తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు తగు రీతిలో నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి మొండిచేయి చూపిన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు ఎక్కడ అంటూ అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. బ్యారికేడ్లు దాటేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటం చేస్తామని బీజేపీ శ్రేణులు హెచ్చరించాయి. మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్‌ను కార్యకర్తలు ఎండగట్టారు. పేదల బతుకులతో ఆడుకుంటున్న రేవంత్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు. కాగా, నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు వెంకట రమణా రెడ్డి, పాయల్ శంకర్, ధనపాల్ సూర్యనారాయణ గుప్తాలను, బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అరెస్టు అయిన వారిని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పరామర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *