– కీలు బొమ్మల్లా రామచందర్ రావు, మహేశ్వర్ రెడ్డి
– టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 :హరీష్ రావు కంట్రోల్‌లో రాష్ట్ర బిజెపి నడుస్తోందని, రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతుందని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మల్లా మారిపోయారని అన్నారు. ఇకనుంచి హరీష్ కార్యక్రమాలకు కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వొచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోందని చెందారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు హరీష్ రావు, ఈటల రాజేందర్ వ్యూహంలో ఇప్పుడు బీజేపీ చిక్కిందన్నారు. సామ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. మరోసారి హరీష్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలకు ఆద్యం పోసినట్టయింది. హరీష్ రావు బీజేపీలో చేరుతారంటూ వొస్తున్న వార్తలు కొత్తేమి కాదు. గతంలో కూడా హరీష్ గులాబీ గూటి నుంచి ఎగిరిపోయి కాషాయ జెండా కప్పుకుంటున్నారని అనేక వార్తలు వొచ్చాయి. ఈ వార్తలపై హరీష్ రావు పలుమార్లు స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ ఎమ్మెల్సీ కవిత హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్ లకు కవిత సూచనలు చేశారు. కాగా కవిత కూడా హరీష్ రావు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని పరోక్షంగా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




