నామినేషన్ వేయనున్న మరికొందరు నేతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఒక కొలిక్కి వొచ్చినట్లుగా వార్తలొిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, అడ్వకేట్ ఎన్.రామచందర్ రావును రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయవలసిందిగా పార్టీ కేంద్ర అధిష్థానం కోరినట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్ దాఖలుకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో రాంచందర్ రావు ఎన్నిక లాంఛన ప్రాయంగా మారింది. ఆయన మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పాత కార్యకర్తనే అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉంది. కాగా, ఈ పదవిపై ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లు ఆశలు పెట్టుకున్నారు. తాను కూడా నామినేషన్ దాఖలు చేస్తానని రాజాసింగ్ ప్రకటించారు.





