– రిజర్వేషన్లపై ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్
– పార్లమెంటుకు గాయబ్ అవుతున్న రాహుల్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం
న్యూఢల్లీి, జులై 21: కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఒకవైపు పార్లమెంటులో అనేక అంశాలపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గాయబ్ అవుతున్న పరిస్థితి ఉందని, అలాంటి వారు బీజేపీిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేయడం అన్యాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తే బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, కానీ ఆర్డినెన్స్ రాకముందే అందులో పది శాతం ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. బీజేపీ మతపరమైన, రాజకీయపరమైన రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకమన్నారు. బీసీలకు 42శాతం ఇవ్వాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.. అయితే కేబినెట్‌లో చర్చ జరిపినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా అన్నది అనుమానం కలుగుతోందని అన్నారు. రిజర్వేషన్ పెంచాలంటే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285లో సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందని, ఇప్పుడు వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని చూస్తోందని అన్నారు. అసలు 9వ షెడ్యూల్‌లో చేర్చే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి తెలుసా? మీ న్యాయ సలహాదారులు ఏమన్నారు అని ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లపై అనేక కేసులు సుప్రీం కోర్టులో ఇప్పటికీ పెండిరగ్‌లో ఉన్నాయంటూ బీసీ రిజర్వేషన్ కోసం 9వ షెడ్యూల్‌ను చూపిస్తూ ప్రజలను పదేపదే మభ్యపెట్టడం సబబుకాదని రామచందర్‌రావు హితబోధ చేశారు. బీసీలను మోసం చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.్ణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులున్నాయని తెలిసి, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285లో సవరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిసీ ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు చర్చించకుండా అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకు బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకం ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యంగా మారాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రంపై నిందలు వేయకుండా 42శాతం రిజర్వేషన్లను తాము హామీ ఇచ్చినట్టుగానే అమలు చేయాలని రామచందర్‌రావు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతోందన్నారు. మధ్యప్రదేశ్‌లో 50శాతం పైగా రిజర్వేషన్లు అమలయ్యాయంటూ దానిపై కాంగ్రెస్ అధ్యయనం చేయాలన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆలోచించలేదు. ఇది బాధాకరమని అన్నారు.
పార్టీలో క్రమశిక్షణ పాటించకుంటే చర్యలే
పార్టీలో ఎవరౖౖెనా క్రమశిక్షణ పాటించకుంటే లేకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని రామచందర్‌రావు హెచ్చరించారు. పార్టీలో కొత్త, పాత అనే తేడా లేదు.. ఈ తేడాలన్నీ కొంతమంది కావాలనే సృష్టిస్తున్న వ్యవహారమని అన్నారు. ఎవ్వరైనా పార్టీకి నష్టం చేసినా, క్రమశిక్షణ తప్పినా వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని, జాతీయ నాయకత్వం కూడా నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే తాను ముక్కలంటూ గతంలో తెలంగాణ సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇద్దరూ కలిసి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కాగా, పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఈరోజు కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం వారి మార్గదర్శనం కోరానని రామచందర్‌రావు తెలిపారు.



