– బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
– పెద్ద ఎత్తున తరలివచ్చిన రిటైర్డు ఉద్యోగులు, టీచర్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన నిరాహార దీక్ష సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ నాయకులు ఈ దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షకు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ధర్నా చౌక్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విశ్రాంత ఉద్యోగులు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ గళమెత్తారు. బకాయిల చెల్లింపులో జాప్యం వల్ల ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నిరాహార దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని బీజేపీ స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





