– దరఖాస్తు కట్టలతో వెళ్లడంపై భద్రతా సిబ్బంది అభ్యంతరం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: అసెంబ్లీ ఎంట్రీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులతో అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు… ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పేపర్ కట్టలు లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేదని భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేలు గట్టిగా వాదించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, పోలీసు-భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు భద్రతా సిబ్బంది పేపర్ బండిల్స్‌ను తీసుకొని బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ లోపలికి అనుమతించారు. అసెంబ్లీ ఎంట్రీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా.. రైతు సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిరసనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదిలాబాద్ కేంద్రంగా బీజేపీ ఎమ్మెల్యే పర్యటించారు. రైతుల నుంచి పంటల బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాలకు తగిన న్యాయం జరగాలంటే బీమా పథకం అమలు అవసరమని బీజేపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. వెంటనే రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రైతు రుణ మాఫీ చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.