ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

– రామచందర్‌రావు గృహ నిర్బంధంపై నాయకుల ఖండన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావును పోలీసులు గృహనిర్బంధం చేసి తనతో సహా అనేకమంది నాయకులను, కార్యకర్తలను నిర్బంధించడం కాంగ్రెస్‌ ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెద్దమ్మగుడి ఆలయ కార్యక్రమం, దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్‌ ఘర్‌ తిరంగా దేశభక్తి యాత్రలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీి నేతల ఇళ్లను ముట్టడిరచిందన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్‌, పలువురు బీజేపీ కార్పొరేటర్లను, ప్రముఖ నాయకులను కూడా గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్య హక్కులపై నేరుగా దాడి చేయడమేనన్నారు. రాజకీయాలకతీతమైన హర్‌ ఘర్‌ తిరంగా, దేశభక్తి కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజల మౌలిక స్వేచ్ఛా హక్కులను హరించడమేనని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలానే ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆయన విమర్శించారు. వెంటనే నిర్బంధాలను ఎత్తివేసి రామచందర్‌ రావు సహా బీజేపీ నాయకులను దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బీజేపీి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల హౌస్‌ అరెస్టులు, నిర్బంధాలను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి తీవ్రంగా ఖండిరచారు. కుంకుమార్చన కార్యక్రమానికి మద్దతు తెలిపిన సందర్భంలో పోలీసుల నిర్బంధాలు ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు. గుడిని కూల్చిన గూండాలను వదిలేసి శాంతియుతంగా పూజలు చేసే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల హక్కులకు భంగం కలిగించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. హోమ్‌ మంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డీ.. మీరు తీసుకొచ్చిన మార్పు ఇదేనా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు మీరు పలికిన చిలక పలుకులు ఏమయ్యాయి.. మీరూ గత ప్రభుత్వ అణచివేత విధానాలనే అనుసరిస్తున్నారా అని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *