బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోంది

– రాష్ట్ర అధ్యక్షుడు రామచుందర్‌రావు
– పార్టీలో ఉప్పల్, మల్కాజిగిరి నాయకుల చేరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన, దేశాభివృద్ధి పట్ల ఆకర్షితులై తెలంగాణలో బీజేపీ¾లోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో మంగళవారం బీజేపీలో చేరారు. వీరికి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సుపరిపాలనతో ఇటు రాష్ట్రంలో రామచందర్ రావు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి క్షేత్రస్థాయిలో పార్టీకి ఆదరణ మరింత పెరిగిందన్నారు. రాష్ట్ర రథసారధి రాంచందర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గళమెత్తుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తీరు చూసి ప్రజలు, వివిధ వర్గాల నాయకులు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారున్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. గతంలో 12 స్థానాలు ఉంటే ఇప్పుడు 22 సీట్లను గెలుచుకోవడం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమన్నారు. కాగా, ఆరఎసఎస్‌ని బ్యాన్ చేయాలనే కాంగ్రెస్ డిమాండ్ విడ్డూరంగా ఉందన్నారు. అమెరికాకు చెందిన యూఎస్‌సీఐఆరఎఫ్ అనే ఒక సంస్థ రిపోర్టును పట్టుకుని కాంగ్రెస్ మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. ఆరఎసఎస్‌ని బ్యాన్ చేయాలంటున్న కాంగ్రెస్ పార్టీ మన దేశ రక్షణ సంస్థ అయిన ‘రా’ని కూడా రద్దు చేయమంటుందా జవాబు చెప్పాలన్నారు. లష్కరే తోయిబా కంటే హిందూ గ్రూపులే ప్రమాదకరమని ఆ రిపోర్ట్ చెబితే కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీలో వందేమాతరం గీతాన్ని మజ్లిస్ అవమానిస్తే కాంగ్రెస్ మౌనమెందుకు వహించినట్లు అని ప్రశ్నించారు. ఇది బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ట. అన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతారు. ఆయన ఒక్కసారి ఆర్టికల్ 51 చదవాలని సూచించారు. రాజ్యాంగబద్ధమైన విధులను విస్మరించి, దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలకడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *