నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి పట్టు

– ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ 4 ‌గెలుపు

నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 13: నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి పట్టు సాధించింది.. ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాలోనూ అధికార పార్టీ తన హవాను కొనసాగిస్తోంది. మొత్తం ఒక కార్పొరేషన్‌, 7 ‌మున్సిపాలిటీలకు గానూ 4 మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. భీంగల్‌ ‌మున్సిపాలిటీలో మొత్తం 12 సీట్లకు గాను కాంగ్రెస్‌ – 8,‌బీఆర్‌ఎస్‌ – 4 ‌స్థానాలు గెలుచుకుంది. బిచ్కుంద మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా  కాంగ్రెస్‌ – 8, ‌బీఆర్‌ఎస్‌ – 2 ‌స్థానాలు దక్కించుకుంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను కాంగ్రెస్‌ – 10, ‌బీఆర్‌ఎస్‌ – 1, ఇం‌డిపెండెంట్‌ – 1 ‌స్థానంలో గెలుపొందారు.  బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎక్కువ వార్డులను సొంతం చేసుకున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్‌ ‌కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 10 వార్డుల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ 2 ‌వార్డులను మాత్రమే సొంతం చేసుకుంది.వార్డు 1: కాంగ్రెస్‌ – ‌గోనె హన్మవ్వ,వార్డు 2: కాంగ్రెస్‌ – ‌చిన్న మారుతి,వార్డు 3: కాంగ్రెస్‌ – ‌కార్తీక ధర్పల్‌,‌వార్డు 4: బీఆర్‌ఎస్‌ – ‌బొమ్మల అనితవార్డు 5: బీఆర్‌ఎస్‌ – ‌శ్యామల,వార్డు 6: కాంగ్రెస్‌ – ‌నౌషా నాయక్‌,‌వార్డు 7: కాంగ్రెస్‌ – ‌ముజాహిద్‌,‌వార్డు 8: కాంగ్రెస్‌ – ‌షేక్‌ ‌గులాం సందానీ,వార్డు 9: కాంగ్రెస్‌ – ‌ధర్పల్‌ ‌గంగాధర్‌,‌వార్డు 10: కాంగ్రెస్‌ – ‌మఠం మానస,వార్డు 11: కాంగ్రెస్‌ – ‌భాగ్యలక్ష్మి,వార్డు 12: కాంగ్రెస్‌ – ‌సీమ షెట్కర్‌ ‌గెలుపొందారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *