ఆమ‌న‌గ‌ల్లుపై బీజేపీ జెండా ఎగ‌రాలి

– అవినీతిలో కేసీఆర్‌ను మించిన రేవంత్‌
– రెండు పార్టీలను ఓడించాలి
– బీజేపీని గెలిపించాలి
– ఎన్నికల ప్రచారంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ ఫామ్ హౌస్ బాట పట్టారని, అదే తీర్పు ను పునరావృత్తం చేస్తే రేవంత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ బాట పట్టాల్సి వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విఠాయిపల్లి మీదుగా ఆమనగల్ పట్టణంలోని పలు వార్డులలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను అభివాదం చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆమనగల్ మున్సిపాలిటీలో బిజెపి  పోటీ చేస్తున్న 15 వార్డులలో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. కారు గుర్తుకు భవిష్యత్తు లేదని బిజెపి, కాంగ్రెస్ ఫామ్ హౌస్ పార్టీలని అన్నారు. ఈ రెండు పార్టీలు ఎంఐఎం చేతిలో కీలుబొమ్మలుగా మారి ఆటలాడుతున్నారన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిలో కేసీఆర్ ని మించిపోయారనీ ఆరోపించారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులను ప్రోత్సహిస్తే  రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతు భరోసా ఇవ్వకుండా మోసం  చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు తులం బంగారం ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదని, మోసం చేసే ఈ పార్టీలను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గరలో ఉందని అన్నారు. బిజెపి జెండా ఆమనగల్లు గడ్డ అని అన్నారు. అభివృద్ధి కోసం బిజెపికి ఓటు వేయాలని తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని కోరారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులలో బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ఆమనగల్లు ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ ఆమనగల్ అభివృద్ధి కోసం జల్ నల్ ద్వారా రూ.32 కోట్లు మంజూరు చేయించామ‌న్నారు. అదేవిధంగా హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి గుండా సెంట్రల్ రైటింగ్ కోసం రూ.600 కోట్లు మంజూరు చేయించామ‌ని, ఆమనగల్లో ఉన్న చంద బావి నుంచి తలకొండపల్లి వరకు కేంద్ర సిఆర్ఎఫ్ నిధులతో రూ.37 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించామ‌న్నారు. హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు నిధులు మంజూరైన పనులు జరగడంలేదని వెంటనే పనులు ప్రారంభించాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గా బిజెపి తరఫున పోటీ చేస్తున్న   అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *