– నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
హైదరాబాద్, జనవరి 19 (ఆర్‌ఎన్‌ఎ): కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అయితే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై సమాధానం చెప్పాలని స్పీకర్‌కు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ అమలు చేయలేదని ఏలేటి పిటిషన్ వేసిన విషయం విదితమే. దాంతో సమాధానం చెప్పాలంటూ స్పీకర్‌కు సంజయ్ కరోల్ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్ పిటిషన్‌లతో జత చేసింది. అన్ని పిటిషన్‌లపై కలిపి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



