– మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లలో బీజేపీ¾కి మెజారిటి లేదని, అయినప్పటికీ విజయం సాధించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీసీ సంక్షేమ, రవాణ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలోని భీమేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 సీట్లుండగా 28 సీట్లతో బీజేపీ గెలిచిందని, అక్కడ పార్లమెంట్ సభ్యుడు మెజారిటీ లేనందున ప్రతిపక్షంలో కూర్చుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, మిగతా పార్టీలు అన్నీ గెలిచాయి.. అక్కడ ఏమవుతుం<దో భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు. కరీంనగర్‌లో 66 డివిజన్లలో బీజేపీ 30 స్ధానాల్లో గెలిచిందని, అయినప్పటికీ మేయర్ తమ పార్టీకి చెందిన వారే అవుతారని బండి సంజయ్ ప్రకటించారని అన్నారు. గతంలో తాము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా కరీంనగర్‌లో మేయర్ అయ్యామని, ఇప్పుడు కూడా అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వ సలహా సూచనల మేరకు వ్యవహరిస్తామని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, మంత్రుల జోక్యం లేదని, స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు తమ ఆలోచనలకనుగుణంగా వ్యవహరిస్తామని అన్నారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలని తమ ఆలోచన అని, దానికనుగుణంగా మంచి పాలకవర్గం ఉంటే బాగుంటుందని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





