– బీజేపీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్
– దేశానికి కీర్తి తెచ్చిన ఘనత అజ్జూదన్న భట్టి
– విమర్శలను కొట్టిపారేసిన పీసీసీ చీఫ్ మహేష్
-ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్న బీజేపీఫ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ అక్టోబర్ 30: మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ తెలంగాణ నేతలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)ను ఆశ్రయించడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండిరచారు. ఇందులో అజారుద్దీన్‌కు కేబినెట్‌లో స్థానం కల్పించవద్దనే కుట్ర కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అజారుద్దీన్ హైదరాబాద్ బిడ్డ అని, క్రికెట్ రంగంలో మన కీర్తిపతాకాన్ని రెపరెపలాడిరచిన వ్యక్తి అని పేర్కొన్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన క్రీడాకారుడు.. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారు.. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలి కానీ మంత్రివర్గంలోకి తీసుకోవద్దని లేఖ రాయడం దురదృష్టకరం అని అన్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపించడంలో భాగంగానే బీజేపీ నేతలు లేఖ రాశారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఎలాగూ గెలవదు కాబట్టి బలహీన వ్యక్తిని నిలబెట్టిందన్నారు. అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోకుండా గవర్నర్‌పైనా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. ఇంతకన్నా దారుణం ఏముంటుందన్నారు. మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకమని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను మైనార్టీలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకేనని, ప్రమాణ స్వీకారం నియోజకవర్గం బయట జరుగుతుందని, ఆయన జూబ్లీహిల్స్‌లో పోటీ చేయడం లేదంటూ ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ అని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సమాజంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం కాంగ్రెస్ మూల సిద్ధాంతమన్నారు. అజారుద్దీన్‌కు కల్పిస్తున్న అవకాశంపై కుట్రలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. కాగా, రాష్ట్ర మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక నిర్ణయాల పట్ల నిబద్ధత ఉన్నాయని స్పష్టం చేశారు. తుఫానుకు సంబంధించి ప్రభుత్వం 46 గంటల ముందే అప్రమత్తమయిందని, 24 గంటలూ పనిచేసిందని, సీఎం రేవంత్ రెడ్డితోపాటు యావత్ కేబినెట్, చీఫ్ సెక్రటరీతో పాటు మొత్తం యంత్రాంగం అప్రమత్తమై కావలసిన చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వ ముందస్తు చర్యల మూలంగా భారీ ప్రాణ, ఆస్తి, ఇతర నష్టం జరగకుండా చూడగలిగామన్నారు. నష్టాలు అంచనా వేసి నష్టపోయిన వారికి సహాయం చేస్తామని, తుఫాను నష్టంపై ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆలోచన చేస్తున్నదని భట్టి చెప్పారు.
మైనారిటీకి అవకాశమిస్తే విషం వెళ్లగక్కుతున్నారు
నాడు భారత క్రికెట్ జట్టుకు అజారుద్దీన్ సేవలందించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. మైనారిటీకి అవకాశమిస్తే విషం వెళ్లగక్కుతున్నారని, మంత్రివర్గ విస్తరణ ఆపాలని బీజేపీ నేతలు ఈసీ వద్ద ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గొప్ప క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం వస్తుంటే అనైతికంగా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. మైనార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో కేబినెట్‌లో అవకాశం ఆలస్యమైందని, అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా మైనార్టీలకు సంక్షేమానికి పాటుపడుతున్నామని తెలిపారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల వేళ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.. అదే రాజస్థాన్‌లో ఉపఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థిని మంత్రిగా చేశారు.. భాజపాకు రాజస్థాన్‌లో ఒక నీతి.. తెలంగాణలో మరో నీతి ఉంటుందా అని మహేష్‌కుమార్ ప్రశ్నించారు. అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే బీజేపీకి వచ్చిన నొప్పి ఏంటని మంత్రి పొన్నం అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లవి ద్వంద్వ నీతి అని ఎద్దేవ ాచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





