ఎంఐఎంపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

– వందేమాతరం ఆలపిస్తుండగా వెళ్లిపోవ‌డంపై

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించిన సంద‌ర్భంలో జాతీయ గీతం వందేమాతరం ఆలాపన జరుగుతుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేయడంపై రాష్ట్ర గవర్నర్‌కు బీజేపీ  ఫిర్యాదు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కోశాధికారి దేవకీ వాసుదేవరావు, మీడియా అధికార ప్రతినిధులు గవర్నర్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లూడుతూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిగా నిలిచిన వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. భారత్ మాతాకి జై అనడం రాదు.. జై హిండ్ అనడం రాదు.. కానీ జై పాలస్తీనా అంటారు అని ఎద్దేవా చేశారు. వందే మాతర గీతం ఆలపించే సమయంలో వాకౌట్ చేయడం అంటే సభా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు.. దేశానికి తీరని అవమానం జరిగిందని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి జాతీయ చిహ్నాల పట్ల కనీస గౌరవం లేని ఎంఐఎం సభ్యుల తీరు వారి సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టిందన్నారు. సభ గౌరవాన్ని, జాతీయ గీత ప్రతిష్ఠను దిగజార్చిన ఆ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. దేశ గౌరవం కంటే ఏ పార్టీ లేదా మతం ముఖ్యం కాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గమని రామచందర్‌రావు స్పష్టం చేశారు.
———————————————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *