ఫ్యూచర్‌ సిటీకి ఎందుకు నిధులివ్వాలో చెప్పండి

– నిధులివ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామంటారా?
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఫ్యూచర్‌ సిటీకి కేంద్రం నిధులివ్వకపోతే బీజేపీిని భూస్థాపితం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఖండిరచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అంటే భయం పట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇష్టానుసారంగా అబద్ధపు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. గత రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో చేసిందేమీ లేదని, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, గత బీఆర్‌ఎస్‌ సర్కారు లాగానే ఫెయిల్యూర్‌ పాలన అయిందని వ్యాఖ్యానించారు. హెల్త్‌, ఎడ్యుకేషన్‌, డెవలప్‌మెంట్‌.. ఇలా అన్నింటిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్లాప్‌ అయింది. అందుకే రేవంత్‌ రెడ్డి సర్కారును ప్రజలు భూస్థాపితం చేయబోతున్నారని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు.. ఎలా ఇవ్వాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? సిటీ ప్లానింగ్‌ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కేవలం కేంద్రం మీద ఏడవడమే కాంగ్రెస్‌ పాలసీ. అమృత్‌ స్కీం, స్మార్ట్‌ సిటీ, స్వచ్ఛ భారత్‌ ఇలా అనేక పథకాలకు కేంద్రం ఏనాడూ నిధులు ఆపలేదని స్పష్టం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపై బీజేపీ అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేస్తున్నారంటూ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ముందుకు ఈ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ విచారణకు హాజరు కావాలని, సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చిన విషయాల ప్రకారం, నేషనల్‌ హెరాల్డ్‌లో అవినీతి, గాంధీ, నెహ్రూ ఫ్యామిలీ ప్రాపర్టీలకు సంబంధించి అన్ని బినామీలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రిటైర్డ్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధిపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదన్నారు. ముందుగా రేవంత్‌ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అంతేగాని బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం వంటి వ్యవహారాలు తగవన్నారు. భారత ప్రభుత్వం రూపొందించిన సైబర్‌ సెక్యూరిటీ యాప్‌ సంచార్‌ సాథీ విషయంలో కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలను రామచందర్‌రావు తీవ్రంగా ఖండిరచారు. డిజిటల్‌ ఇండియాలో అనేక మార్పులు జరుగుతుంటాయని, డిజిటల్‌ ఇండియాలో భాగంగా తీసుకొచ్చే ఏ పథకం, ఏ యాప్‌ అయినా ప్రజాసంక్షేమం, భద్రత కోసం మాత్రమే ఉంటుందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *