చార్మినార్‌ ‌వద్ద బిజెపి బతుకమ్మ

– పాల్గొన్న నేతలు, నటి ఖుష్బూ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:‌బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్‌ ‌వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, ప్రజలు, సాంస్క•తిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు, తమిళ్‌నాడు బీజేపీ నేత, సినీ నటి కుష్బూ, మాజీ మంత్రి కిషన్‌ ‌రెడ్డి సతీమణి కావ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్‌ ‌ప్రాంగణంలో పూలతో అలంకరించిన బతుకమ్మ ఆడిపాడారు. బతుకమ్మ పాటల కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు, పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ నృత్యం చేసి, పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కుష్బూ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *