– ఇందూరులో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో రామచందర్‌రావు
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఇందూరు ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు రూ.25 లక్షలకు ధర్మపురి అర్వింద్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల సంక్షేమం కోసం వితరణ చేశారు. కార్యకర్తల పట్ల అర్వింద్‌కు ఉన్న ప్రేమ గొప్పదంటూ మానవతావాదంతో ఒక బాధ్యతతో ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న ఆయనకు అభినందనలు తెలిపారు. ఇందూర్‌లో బూత్‌స్థాయి సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నిజామాబాద్‌లో బీజేపీ చరిత్ర మరువలేనిదని, రాబోయే రోజుల్లో జడ్పీ చైర్మన్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుందని చెప్పారు. అర్వింద్ నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తీసుకొచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రారంభింపచేశామన్నారు. తెలంగాణలో రైతుబంధు బంద్ అయిందపి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో అనేక వాగ్ధానాలు చేసి మాట తప్పిందని విమర్శించారు. ‘ఓటు చోరీతోనే బీజేపీ గెలుస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారంటూ ఏ ఓటరు లిస్టుతో బీజేపీ సభ్యులు గెలిచారో అదే లిస్టుతో కాంగ్రెస్ నాయకులు కూడా గెలిచారు. ఏ యంత్రాంగం ఎన్నికలు నిర్వహించిందో, అదే యంత్రాంగం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా 8 ఎంపీలను గెలిపించుకుంది.. ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిందని వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ మరోవైపు 10 శాతం మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో 46 శాతం రిజర్వేషన్లు బీజేపీ తరఫున బీసీలకే ఇస్తామని తాను ముందే చెప్పానని, ఎందుకంటే బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని అన్నరు. తాను పలు జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో మాట్లాడాను.. ఎక్కడా యూరియా కొరత లేదని వారు చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటగా రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం బీఆర్‌ఎస్. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగినది కూడా బీఆర్‌ఎస్ పాలనలోనే. అందుకే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు. అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో అనేకమంది ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తున్నారు. వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌తోపాటు బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడిరచి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రామచందర్‌రావు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





