ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు

-ప్రధాని మోదీ, రాష్ట్ర మంత్రులు, రాజకీయ‌, సినీ, క్రీడా ప్రముఖులు 

హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్‌ 8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం  56వ పుట్టిన రోజు జరుపుకున్నారు . ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కి  ప్రముఖులు  సోషల్‌ మీడియా వేదికగా  శుభాకాంక్షతెలియజేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  రేవంత్‌ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్‌ రెడ్డికి ఎక్స్‌ వేదికగా , ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌,  ఏపీ మంత్రి నారా లోకేష్‌ బర్త్‌ డే విషెస్‌ తెలియజేసారు.  సినీ రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్‌ చిరంజీవి రేవంత్‌ రెడ్డికి బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. రేవంత్‌ మంత్రివర్గ సహచరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు, సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ ద్వారా పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి జన్మదిన సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర శాసనసభ అధ్యక్షుడు డా. గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు ,   మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, కొండా సురేఖ, మహమ్మద్‌ అజారుద్దీన్‌, బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, డాక్టర్‌ లక్ష్మణ్‌, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, డీఎంకే నాయకురాలు కనిమొళి తదితరులు శుభాకాంక్షలు తెలిపిన‌వారిలో ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *