పెయింటింగ్ ద్వారా రేవంత్‌కు పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లు

– ఒక యువ‌ చిత్ర‌కారుడి య‌త్నం

కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్  తన కుంచెతో  ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి  పలు భారీ ప్రాజెక్టులను సాధించి  అన్ని విధాలుగా ఆదుకుంటానని పలు వేదికలపై భావోద్వేగంగా చెప్పిన మాటలకు చిత్ర రూపాన్నిఇచ్చాడు. నేడు ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా పెయింటింగ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆయ‌న‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. మా అభిమాన నాయకుడికి కృతజ్ఞతలు చెప్పాలన్న సంకల్పంతోనే ఈ చిత్రాన్ని వేశానని చెప్పాడు. ఈ ప్రాంత నాయకులు త‌న‌ కళా సేవను గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి  తీసుకువెళ్తారన్న ఆకాంక్ష‌ను అశోక్  వ్య‌క్తం చేశాడు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *