– ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటింటి ప్రచారం
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 9వ, 10వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటింటా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే అయిలయ్య ప్రజలకు వివివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





