ముగింపు దశకు బీహార్‌ ఓటర్ల జాబితా పరిశీలన

న్యూదిల్లీ, జులై 23: బీహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్‌) 2025 జూన్‌ 24న ప్రారంభమైందని, తొలి దశ ముగింపు దశకు వచ్చిందని భారత ఎన్నికల సంఘం తరపున ఉప సంచాలకుడు పి.పవన్‌ ఒక ప్రకటలో తెలిపారు. అర్హత లేని ఓటరు ఎవ్వరూ చేర్చకూడదని, అర్హులైన ఓటరు ఎవరూ మిగలకూడదనేది దీని మూల ఉద్దేశమని పేర్కొన్నారు. 2025 జూలై 23 నాటికి వెలుగులోకి వచ్చిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఓటర్లలో 98.01 శాతం సమాచారం సేకరించగా 20 లక్షల మంది ఓటర్లు మృతిచెందినట్లు, 28 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్ళినవారిగా గుర్తించామని తెలిపారు. 7 లక్షల మంది వివిధచోట్ల దౌలతుగా నమోదైనవారున్నారని, లక్షమంది ఓటర్లు కనపడకుండా పోయారని పేర్కొన్నారు. 15 లక్షల మంది తమ ఫారాలను తిరిగి సమర్పించలేన్నారు. 7.17 కోట్ల ఓటర్ల ఫారాలు (90.89 శాతం) స్వీకరించి డిజిటలైజ్‌ చేశామని వివరించింది. అసమగ్రంగా చేర్పునకు గురైన ఓటర్లు, ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్ల జాబితాను బీహార్‌లోని 12 ప్రధాన రాజకీయ పార్టీలు నియమించిన 1.5 లక్షల బూత్‌స్థాయి ప్రతినిధుల(బీఎల్‌వో)కు జూలై 20న పంపించామని ఎన్నికల సంఘం తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో తాత్కాలికంగా నివసిస్తున్న బీహార్‌ ఓటర్లు ష్ట్ర్‌్‌జూం://వశ్రీవష్‌శీతీం.వషఱ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా లేదా ఈసీఐఎన్‌ఈటీ మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫారమ్‌ నింపవచ్చునని సూచించింది. ఫారమ్‌ను ముద్రించి సంతకం చేసి కుటుంబ సభ్యుల ద్వారా బూత్‌స్థాయి అధికారికి పంపవచ్చునని, ముద్రించిన, సంతకం చేసిన ఫారాన్ని వాట్సాప్‌ ద్వారా బీఎల్‌వోలకు పంపవచ్చునని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 1న విడుదల చేస్తామని, ముసాయిదాలో పేర్లు తప్పుగా ఉన్నా, లేదా పేరు లేకున్నా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదుదారుడి (ఈఆర్వో) లేదా సహాయక ఈఆర్వో వద్ద సెప్టెంబర్‌ 1లోపు అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లు సమర్పించవచ్చున. సమర్పించిన ఫారం స్థితిని తెలుసుకోవాలంటే ష్ట్ర్‌్‌జూం://వశ్రీవష్‌శీతీం.వషఱ.స్త్రశీఙ.ఱఅ/ష్ట్రశీఎవ/వఅబఎ ఖీశీతీఎుతీaషస
ఫారాల్లో మొబైల్‌ నంబర్‌ ఇచ్చిన ఓటర్లకు ఎన్నికల సంఘం నుంచి సందేశాలు పంపనున్నా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. ఓటు హక్కును వినియోగించుకోండి అని పవన్‌ పిలుపునిచ్చునన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *