- ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
- డిప్యూటి సిఎం సిన్హా కారుపై దాడి
పాట్నా, నవంబర్ 6: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల సమయం వరకు 60.13 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ రోజు తొలిదశ పోలింగ్‌లో భాగంగా 121 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. మొత్తం 121 నియోజకవర్గాల్లో పోలింగ్ దాదాపు ప్రశాంతంగానే జరిగింది. లఖిసరాయ్ నియోజకవర్గంలో మాత్రం కాస్త ఆందోళన నెలకొంది. బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది. లఖిసరాయ్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను విజయ్ కుమార్ సందర్శిస్తున్న సమయంలో ఆయన కారును కొందరు వ్యక్తులు అడ్డుకునే యత్నం చేశారు . విజయ్ కుమార్ వాహనంపై చెప్పులు, పేడ విసరడంతో పాటు, ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. విజయ్ కుమార్ సిన్హా వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ హింసాత్మకంగా మారింది. గురువారం ఉదయం 7 గంటలకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సమయంలో బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది. లఖిసరాయ్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన కాన్వాయ్‌పై ఆర్జేడీ కార్యకర్తలు దాడి చేశారని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ ఆటవిక పాలన తప్పదని విజయ్ కుమార్ సిన్హా హెచ్చరించారు. లఖిసరాయ్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను విజయ్ కుమార్ సందర్శిస్తున్న సమయంలో ఆయన కారును కొందరు వ్యక్తులు అడ్డుకునే యత్నం చేశారు. విజయ్ కుమార్ వాహనంపై చెప్పులు, పేడ విసరడంతో పాటు, ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. విజయ్ కుమార్ సిన్హా వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. తన నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్జేడీ కార్యకర్తలు ప్రయత్నించారని, దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోలేదని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి జనసమూహాన్ని వెనక్కి నెట్టి, విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌ను సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీహార్ రాష్ట్ర డీజీపీని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదేశించినట్టు ఈసీ తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





