వరల్డ్ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డ్సులో నితీశ్‌ ‌కుమార్‌

‌పాట్నా, డిసెంబర్‌ 6: ‌బీహార్‌ ‌ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (‌యునైటెడ్‌) అధినేత నితీశ్‌ ‌కుమార్‌ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో, ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును వరల్డ్ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌గుర్తించి, తమ జాబితాలో చేర్చింది. ఈ మేరకు సదరు సంస్థ నితీశ్‌ ‌కుమార్‌కు ప్రత్యేకంగా అభినందన లేఖను పంపింది. ఒకే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని పదిసార్లు పాలించడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అరుదైన ఘనత అని వరల్డ్ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌తన లేఖలో పేర్కొంది. 1947 నుంచి 2025 మధ్య కాలంలో పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి వ్యక్తిగా నిలవడం భారతదేశానికి గర్వకారణం. ఇది మీ అంకితభావానికి, దార్శనిక నాయకత్వానికి నిదర్శనం. బీహార్‌ ‌ప్రజలు మీపై ఉంచిన విశ్వాసానికి ఈ అసాధారణ విజయం తార్కాణం అని ప్రశంసించింది. సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం నితీశ్‌ ‌కుమార్‌ ‌చేస్తున్న కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఆ సంస్థ కొనియాడింది. ఆయన నాయకత్వ పటిమ వల్లే పదేపదే ప్రజల మన్ననలు పొందుతున్నారని వివరించింది. ఈ అరుదైన గౌరవం దక్కడంతో నితీశ్‌ ‌కుమార్‌కు పలువురి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *