బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

“కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇండియా కూటమికి, సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారం నిలుపుకునేందుకు ఎన్డీయే బీహార్‌ ఫలితాలు చాలా ముఖ్యం. బీహర్ ఫలితాలు యూపీ, బెంగాల్‌లో మాత్రమేకాదు అస్సాం, జార్ఖండ్ మధ్యప్రదేశ్‌తో పాటు చైనాతో సరిహద్దు రాష్ట్రాలపై ఉంటుంది.ఒక రకంగా కేంద్రంలో అధికారంలో ఉంటే కూటమికి బీహర్‌ రాష్ట్రం గుండె కాయలాంటింది. ఈ నేపథ్యంలోనే బీహర్‌ గెలుపును రెండు కూటములు సవాల్‌గా తీసుకున్నాయి.”

ఎన్నికల కురుక్షేత్రానికి బీహార్‌ సిద్దం అయింది.దేశంలో రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వొట్లు, సీట్లు, అధికారం కోసం పాకులాడే రాజకీయ పార్టీలు యాధావిధిగా తమదైన స్టైల్‌లో ప్రచారం మొదటలు పెట్టాయి.ప్రజలను నమ్మించేందుకు, మాయ మాటలతో వంచించేందుకు.పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.వోటర్లను ఆకట్టుకునేందుకు, ఆకర్షించేందుకు వారికి దగ్గరయ్యేందుకు ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు..అధికారం నిలబెట్టుకునేందుకు ఎన్‌డీయే, ఈ సారి ఎలాగైన పవర్‌లోకి రావాలని ఇండియా కూటములు వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.

అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్‌ రెండో వారంలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.మొత్తం 243 స్థానాలకు విడదతల వారిగా పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.మిగిలింది షెడ్యూల్‌ విడుల చేయడం ఒక్కటే మిగిలింది..అయితే మధ్య భారత దేశంలో ఉన్న బీహార్‌ రాష్ట్ట్రంలో అధికారంలోకి రావడం కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న, ప్రస్తుతం పవర్‌లో ఉన్న పార్టీలకు వ్యూహాత్మకంగా బీహార్‌ చాలా ముఖ్యమైన రాష్ట్రం.

దేశ రాజకీయాలను బీహార్‌ ప్రభావితం చేస్తుంది.బీహార్‌లో గెలవడాన్ని ఇండియా,ఎన్డీయే కూటములు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సభలు సమావేశాలతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ఎవ్వరి స్టైల్‌లో వారు ప్రయత్నాలు చేస్తున్నారు..బీహార్‌లో గెలవడాన్ని ఎన్డీయే కూటమి ప్రేస్టేజీగా తీసుకుంది.అందుకే ప్రధాని మోదీ నుంచి అమిత్ షా , కేంద్ర మంత్రులందరూ బీహార్‌లో మేరువేగంగా పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బీహార్‌ను మినీ ఎన్నికల కురుక్షేత్రంగా మార్చుతుంది. బీహార్‌లో ఒకవైపు మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి నేతలు వరుస పర్యటనలతో ప్రచారంలో దూసుకుపోతుంటే.ఇండియా కూటమి మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా ప్రచారంలో నత్తనడకగా నడుస్తుంది.ఇండి కూటమి తీరు చూస్తుంటే అసలు బీహార్ ఎన్నికలను లైట్ తీకున్నట్లు అనిపిస్తుంది.ఒకవైపు పక్క ప్రణాళికలతో ఎన్డీయే కూటమి ప్రచారంలో దూసుకుపోతుంటే..కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి మాత్రం బీహార్‌ వైపుకూడా చూడటం లేదు.

కానీ, మరోవైపు ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఆర్జేడీ, తేజస్వి యాదవ్ బీహార్ ఎన్నికల్లో ఒంటరయ్యారు.మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాలు పూర్తి చేసి, కేంద్ర రాష్ట్ర నేతలను సమన్వయం చేసుకుంటే ప్రచారంలో దూసుకుపోతుంటే.రాహుల్ నేతృత్వంలో ఇండి కూటమి ప్రచారంలో చతికిలపడ్డట్లు కనిపిస్తుంది.ఇప్పటి వరకూ అసలు బీహార్‌లో ఇండి కూటమి పోటీలో ఉంటుందా..లేదా కాంగ్రెస్‌, ఆర్జేడీ సహా ఇతర పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తాయనా, కూటమిగా పని చేస్తాయని అన్నది స్పష్టత లేదు.

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు..తిప్పికొడితే మూడు నెలలు మాత్రమే ఉంది.ఎన్నికల సమయం దగ్గరపడుతున్న ఇండియా కూటమిలో కనీసం చలనం కనిపించడం లేదు.ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఒంటరిగానే అడపదడప సభలు పెడుతున్న కాంగ్రెస్‌ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు..హర్యానా, జమ్ముకాశ్మీర్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో పోత్తులు, సీట్లు పంపకంపై కాలయాపన చేసి ఎన్నికల్లో గెలిచే చోట్లు కూడా ఇండియా కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు బీహార్‌ కూడా అదే తప్పు చేస్తుంది.తీర టైం వరకు సీట్ల పంచాయితీ తేల్చకపోవడం, కూటమిలో మిత్రపక్షాలతో చర్చికుండా కాంగ్రెస్‌ పదేపదే అదే తప్పు చేస్తుంది.నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్ విత్‌ డ్రా రోజు వరకూ సీట్ల పంపకం పూర్తి చేయకుండా ఎన్డీయే కూటమికి పరోక్ష లబ్ది చేస్తున్నారన్న చర్చ కాంగ్రెస్, ఆర్జేడీ నేతల్లో జరుగుతుంది.కాంగ్రెస్‌ చూపిస్తున్న అలసత్వం వల్ల బలంగా ఉన్న ఆర్జేడీ బలహీనపడే ప్రమాదం ఉందని, అవసరం అయితే ఒంటరిగానే పోటీ చేయాలన్న డిమాండ్స్‌ కూడా అర్జేడీ నేతలు తేజస్వీ పై ఒత్తిడి తేస్తున్నారు.

బీహార్‌లో జేడీయూపై సీఎం నితీష్‌ కుమార్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది.అధికారం కోసం నిత్యం పార్టీలు మారుతారన్న అపవాదు ఉంది.నితీష్ కుమార్‌కు సీఎం సీటు తప్ప బీహార్ ప్రజల అభివృద్దిపై శ్రద్ధలేదన్న అసంతృప్తి ఉంది.అంతేకాదు, ఇండియా కూటమిలో ఉండి , బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసి బీహార్‌ ప్రజలకు, ఇండియా కూటమి పార్టీలకు వెన్నుపోటు పోడిచి ఎన్డేయే పంచన చేయడంతో రాష్ట్రంలో నితీష్ కుమార్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అటు ఎన్డేయే కూటమి ప్రభుత్వంలో బీహర్‌లో ప్రజల పరిస్థితి మరింత పెరిగింది..డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని మోదీ , నితిష్‌ కుమార్‌ ప్రచారం చేసిన అది మేడిపండు చందానే ఉంది.రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది.పేదరికం ఆకలి కేకలు పెరిగాయి..శాంతి భద్రతలు క్షీణించాయి.పేదలపై అట్రాసిటీస్‌ పెరిగాయి..దీంతో ఎన్డీయేపై ప్రజల్లో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకను అనుకూలంగా మార్చుకోవడంలో ఇండియా కూటమిపై వెనుకబడింది.కాంగ్రెస్‌ వ్యవహరశైలితో ప్రజల ప్రాథమిక సమస్యలను అడ్రెస్‌ చేయడంతో ఇండి కూటమి విఫలం అయింది.కాంగ్రెస్‌ తీరుతో బీహార్‌లో బలంగా ఉన్న అర్జేడీ బలహీనపడుతుందన్న చర్చ ఉంది. మరోవైపు రాష్ట్రంలో బలంగా ఉన్న తేజస్వీ యాదవ్‌ను బలహీనర్చేందుకు బీజేపీ, ఎన్డీయే కూటమి ప్రయత్నాలు చేస్తుంది.ఇప్పుడున్న పరిస్థితిల్లో బీహార్లో బీజేపీ వోట్ బ్యాంక్‌ను ప్రభావితం చేసే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదు.అందుకే తేజస్వీ యాదవ్‌ను బీజేపీ టార్గెట్ చేసింది.ఆర్జేడీలో బీజేపీ తనదైన స్టైల్‌లో షిండేలను తయారు చేయడం.లాలు కుటుంబంలో చిచ్చు పెట్టడం, అనేక అక్రమ కేసులతో కుటుంబాన్ని, తేజస్వీ యాదవ్‌ను ఇబ్బంది పెట్టే కుట్రలను బీజేపీ వేగవంతం చేసింది.

బీహార్‌లో ఎన్డీయే కూటమి చాలా వ్యూహత్మకంగా ప్రచారం చేస్తుంది..ఎక్కడ కూడా బీహార్‌ సమస్యలు, పెదరిగం, నిరుద్యోగం, శాంతి భద్రతలపై చర్చలేకుండా, సీఎం నితిన్ పై బీహారీల్లో ఉన్న వ్యతిరేకత,అసంతృప్తిత ఎక్కడ కనిపించకుండా ఎన్డీఏ ప్రచార వ్యూహాలు పన్నుతుంది. బీహర్‌లో గత కొంత కాలంగా వరుసగా కూలుతున్న బ్రిడ్జీలపై, గుండా రాజ్‌, గన్‌ కల్చర్‌, దోపీడిలు దోమ్మిలపై, ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతిపై ప్రజల్లో చర్చల లేకుండా మోదీ , ఎన్డీయే పార్టీలు తెలివిగా ప్రచార ఎత్తులు అమలు చేస్తున్నారు.అంతేకాదు ఇండియా కూటమిపై ఆర్జేడీపై తిరిగి బీజేపీ అటాక్ చేస్తుంది.ప్రధాని మోదీ తనదైన స్టైల్‌లో హావాభావాలతో కాంగ్రెస్‌, ఆర్జేడీపై విరుచుకుపడుతున్నారు.

నిజానికి బీహార్‌లో సీఎంగా నితిష్‌ కుమార్‌ విఫలం అయ్యారు..ఎన్డేయే ప్రభుత్వం ఫెయిల్ అయింది..అంతేకాదు బీహార్‌ ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్‌ను బీజేపీ వ్యూహత్మంగా తప్పించింది.మోదీ షాలు ఆ బాధ్యతలను భుజాలెత్తుకున్నారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్‌లో కూడా ఒంటరిగానే అధికారంలో వచ్చేందుకు పక్క ప్లాన్‌తో ఉన్నారు..శివసేన షిండేను, అజిత్ పవార్‌ను బలహీనర్చినట్లే బీహార్‌లో కూడా నితిష్‌ కుమార్‌ను బలహీనర్చి బీజేపీ అధికారంలోకి వచ్చేలా మోదీ షాలు వ్యూహాలు అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీహార్‌లో ఒంటరిగానే బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది..బీహార్లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు..రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం డబుల్ ఇంజన్‌ అభివృద్ధి మంత్రం పని చేయడం లేదు.వెరిసి అది విఫల విధ్వంసం మంత్రం అన్న అభిప్రాయం బీహారీల్లో వ్యక్తం అవుతుంది.దీంతో రూట్ మార్చిన మోదీ ఆపరేషన్‌ సింధూర్‌ను ఎన్నికల్లో ప్రచారాస్త్రాంగా మార్చుకున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నెక్ట్‌ డేనే బీహార్‌లో మోదీ పర్యటించారు.దేశ భక్తి, ప్రజల సెంటిమెంట్‌ను, సింధూర్‌తో ముడిపెట్టి రాజకీయాలు చేశారు..అంతేకాదు ఎన్నికల నోటిఫికేషన్స్‌ దగ్గర పడుతుండటంతో ఆపరేషన్ సిందూర్ వాడుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది.బీహార్‌లో అన్ని సమస్యలను ఆపరేషన్‌ సింధూర్‌ ప్రవాహంలో కొట్టుపోయే మోదీ స్కేచ్‌ వేశారు.కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కింగ్ మేకర్‌గా మార్చుతూ బీజేపీ తన దైన స్టైల్‌ రాజకీయాలు చేస్తుంది.

వాస్తవానికి బీహార్‌లో గెలిచేందుకు ఎన్డీయే కూటమి కంటే..ఇండియా కూటమికే ఎక్కువ అవకాశాలున్నాయి..రాష్ట్రంలో పరిస్థితులు ఇండి కూటమికి అనుకూలంగా ఉన్నాయి.అయితే వాటినే అందిపుచ్చు కోవడంతో ఇండియా కూటమి విఫలం అయింది..శత్రువు బలహీనతలే తన బలంగా మార్చుకుని రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తూ, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని గెలవడం బీజేపీ సక్సెస్‌ మంత్ర.ఇప్పుడు బీహార్‌ అదే వ్యూహాన్ని అమలు చేస్తుంది. బీహార్‌ అంటేనే కుల రాజకీయాలకు పుట్టినిల్లు..90వ దశకంలో దేశ రాజకీయాలను బీహార్‌ కుల రాజకీయాలు మార్చేశాయి.మండల్ కమండల్ పాలిటిక్స్‌ దేశంలో బీహార్‌ను తిరుగులేని శక్తిగా మార్చింది.కుల రాజకీయాల నుంచే ఆర్జేడీ పురుడు పోసుకుని కేంద్రాన్ని సవాల్ చేసింది.ఇప్పుడు కూడా ఎన్నికల్లో ఆర్జేడీ కుల రాజకీయాలను నమ్ముకుంది..అటు బీజేపీ కూడా మతం,సెంటిమెంట్‌ రాజకీయాలతో పాటు కుల రాజకీయాలను నమ్ముకుంది. జనగణనతో పాటు కుల గణన చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని బీహర్‌లో లబ్దిపొందే ప్రయత్నం ఎన్డీఏ చేస్తుంది.

వాస్తవానికి జనగణతో పాటు కుల గుణన అనేది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పోరాట ఫలితం..కానీ కల గణనను క్లైమ్ చేసుకోవడంలో, ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకోవడంలో కాంగ్రెస్,ఇండి కూటమి వైఫల్యం చెందింది.ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం చెందింది. అంతేకాదు ఆపరేషన్‌ సింధూర్‌ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దౌత్త వైఫల్యాన్ని వోట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలం అయింది. మరోవైపు బీహార్‌లో లెఫ్ట్‌ పార్టీలు కూడా ఎంతో కొంత బలంగా ఉన్నాయి.దాదాపు 50 ఉంచి 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్యూనిస్ట్‌ ప్రభావం ఉంటుంది.అయితే కమ్యూనిస్టు పార్టీలు కూడా పూర్తిగా బలహీన స్థితిలో ఉన్నాయి.బలమైన నాయకుడు లేరు.అయితే కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి ఎక్కవ విఫలం అయిందో అక్కడ నుంచే మోదీ షాలు ప్రచారం మొదలు పెట్టారు..ఇండియా కూటమి వైఫల్యాలను తనకు అనుకూలంగా మార్చుకుని తన ఖాతాలో వేసుకుంటూ వోట్లుగా మార్చుకుటుంది.

బీహార్‌లో గెలుపు ఓటములు పక్కనే యూపీ రాష్ట్రంపై పడుతుంది.2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై బీహార్‌ ఫలితాలు ప్రభావతం చూపిస్తుంది.అంతేకాదు యూపీతో బీహార్‌కు మధ్య ప్రజలు, రాజకీయ పార్టీల మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది.ఒక రాష్ట్రంలోని రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామాల ఎఫెక్ట్‌ మరో రాష్ట్రంలో ఉంటుంది. అంతేకాదు బీహార్‌ ఫలితాల ప్రభావం అటు బెంగాల్‌ ఎన్నికలపై కూడా పడుతుంది. బంగాల్‌లో అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి, ఎన్డీయే కూటమికి బీహర్‌ గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇండియా కూటమికి, సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారం నిలుపుకునేందుకు ఎన్డీయే బీహార్‌ ఫలితాలు చాలా ముఖ్యం. బీహర్ ఫలితాలు యూపీ, బెంగాల్‌లో మాత్రమేకాదు అస్సాం, జార్ఖండ్ మధ్యప్రదేశ్‌తో పాటు చైనాతో సరిహద్దు రాష్ట్రాలపై ఉంటుంది.ఒక రకంగా కేంద్రంలో అధికారంలో ఉంటే కూటమికి బీహర్‌ రాష్ట్రం గుండె కాయలాంటింది. ఈ నేపథ్యంలోనే బీహర్‌ గెలుపును రెండు కూటములు సవాల్‌గా తీసుకున్నాయి.

బీహర్ ఎన్నిక ప్రచారం మొత్తం ఆపరేషన్ సిందూర్‌, పహల్గాం ఉగ్రడాది చుట్టే బీజేపీ తిప్పుతుంది..బీహర్‌ ప్రజల సెంటిమెంట్, భాగోద్వేగాలకు తోడు హిందీ భాషాను కూడా బీజేపీ ప్రచారానికి వాడుకుంటుంది. బీహార్‌, యూపీలో హిందీ మాట్లాడే వారి సంఖ్య ఏక్కువ.99 శాతం మంది ప్రజలు హిందీలో మాట్లాడుతారు. దీంతో హిందీ భాషాను కూడా ఎన్నికల్లో బీజేపీ వాడుకుంటుంది.ఏదీ ఏమైనా బీహర్‌ ఎన్నికల ఫలితాలు వచ్చే యూపీ, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనేకాదు కేంద్ర రాజకీయాలపై ప్రభావితం చూపిస్తాయి.

-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *