తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

– రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ కొట్టివేత
– హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా విచారించలేం
– సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ

న్యూదిల్లీ, అక్టోబర్‌ 6 (ఆర్‌ఎన్‌ఎ): బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ అంశం హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండిరగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ దవే, అభిషేక్‌ సింఫ్వీు, ఏడీఎన్‌ రావులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్‌ 32 కింద పిటిషన్‌ ఎందుకు ఫైల్‌ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్‌ పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం కొట్టివేసింది. అంతేగాక బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జీవో నెంబర్‌` 9ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. వీరు సీనియర్‌ న్యాయవాదులతో ఆదివారం నుంచి మంతనాలు జరిపారు. ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని కోరారు. దీంతో ఇక ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు దాదాపుగా మార్గం సుగమమయిందని భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *