భూదాన్‌ ‌భూ వివాదంలో ఎలా జోక్యం చేసుకుంటారు?

– కానిస్టేబుల్‌ను నిలదీసిన హైకోర్టు
– బెదిరిస్తే సస్పెన్షన్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 05: ‌రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్‌ ‌భూముల వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటాని పోలీసులను హైకోర్టు నిలదీసింది. ఇదే తీరుగా మళ్లీ జోక్యం చేసు కుంటే సస్పెన్షన్‌కు ఆదేశిస్తామని హెచ్చ రించింది. పిటిషనర్‌ను బెదిరించడం, హైకోర్టులోని పిటిషన్‌ను వాపస్‌ ‌తీసు కోవాలని ఒత్తిడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నొక్కి చెప్పింది. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం చేస్తే కఠిన నిర్ణయాలు ఉంటాయంది. నాగా రంలోని భూములను ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అక్రమంగా తమ పేరిట పట్టా పొం దారని, ఈ దీనిపై ఎంక్వ యిరీ కమిషన్‌తో విచా రణకు ఆదేశిం చాలంటూ పడమటి తండాకు చెందిన రాములు హైకోర్టులో పిటిషన్‌ ‌వేశారు. ఈ కేసును వాపస్‌ ‌తీసుకోవాలంటూ పోలీసులు తనను పోలీసులు బెదిరిస్తున్నారంటూ తాజాగా మరో పిటిషన్‌ ‌వేశారు. దీనిని జస్టిస్‌ ‌కె.లక్ష్మణ్‌ ‌విచారణ చేపట్టారు. పిటిషనర్‌కు ఫోన్‌ ‌చేసిన మహేశ్వరం పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ ‌వెంకటేశ్వర్లును కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించారు. మంగళవారం జరిగిన విచారణకు కానిస్టేబుల్‌ ‌స్వయంగా హాజరయ్యారు. పిటిషనర్‌ ‌రాములుకు ఫోన్‌ ‌చేశావా.. ఎవరు చేయమంటే చేశావు.. పిటిషన్‌ను వాపస్‌ ‌తీసుకోవాలని బెదిరించావా.. అని కానిస్టేబుల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. విలేజీ హిస్టరీ రికార్డు నమోదులో భాగంగా రాములుకు ఫోన్‌ ‌చేశారని కానిస్టేబుల్‌ ‌బదులిచ్చారు. ఎస్‌హెచ్‌వో ఆదేశాల మేరకే ఫోన్‌ ‌చేసినట్లు చెప్పారు. కోర్టులోని పిటిషన్‌ ‌గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. దీనిపై హైకోర్టు, మరోసారి బెదిరించినట్లు తెలిస్తే సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరించింది. సుమారు 25 మంది ఐఏఎస్‌/ఐపీఎస్‌ అధికారులకు చెందిన వ్యవహారమని, ఇది దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందని, ఈ విషయంలో పోలీసులు తలదూరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది. ఇక మీద పోలీసులు పిటిషనర్‌ ‌విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని లాయర్‌ ‌విజయలక్ష్మి కోరగా, తామిచ్చిన హెచ్చరికలు సరిపోతాయని, రాతపూర్వక ఆదేశాలు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెదిరింపులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను ముగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *