– ప్రత్యేక పూజలు, నిలువెత్తు బంగారం సమర్పణ
మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పింకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిందని, భక్తులందరూ ఎలాంటి హడావుడి, తొక్కిసలాటకు గురికాకుండా ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకుని ఇళ్లకు క్షేమంగా తిరిగి చేరుకోవాలని సూచించారు. అమ్మవార్ల దయవల్ల అందరికీ మంచి జరగాలని భట్టి ఆకాంక్షించారు. వీరి వెంట మంత్రులు దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





