హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలోని శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి దర్శనం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని ఆయన అన్నారు. నూతన దంపతులైన తన కుమారుడు, కోడలు సూర్య విక్రమాదిత్య- సాక్షిలకు ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించి, విజన్-2047లక్ష్యంగా ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని కూడా ఏడుకొండలవాడిని కోరుకున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




