స‌మాజ సేవ‌కు ఇది గొప్ప అవ‌కాశం

– రాష్ట్రంలో ఎవ‌రూ ఖాళీగా వుండొద్దు
– ఇదే దృక్ప‌థంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ది
-ఒకే రోజు ఇన్ని నియామ‌క ప్ర‌తాలు ఎప్పుడూ ఇవ్వ‌లేదు
– డిప్యూటి ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 18:  అయితే బడికి వెళ్లాలి లేదంటే ఉద్యోగం చేయాలి రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండొద్దన్న‌ ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్న‌దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం శిల్పకళా వేదికలో గ్రూప్ 2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి రావాలి వచ్చిన ప్రతిబిడ్డ ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవాలి నైపుణ్యాలు పొందాలి, ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగాలు పొందేందుకు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఒకే రోజు 783 మందికి గ్రూప్ 2 నియామక పత్రాలు అందించడం చరిత్రలో సువర్ణాక్షలతో లిఖించదగిన రోజు ఇది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన తన రాజకీయ అనుభవంలో ఏనాడు ఇంతమందికి ఒకేసారి నియామక పత్రాలు అందించిన దాఖలాలు లేవన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనమే సాధించవచ్చు అన్న ఆశతో దశాబ్ద కాలం పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేశామ‌న్నారు. యువత ఆశలు నెరవేర్చాలి వారి కోరికలు తీర్చాలి  అనే ఏకైక సంకల్పంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసాం, గ్రూప్ వన్, గ్రూప్ టు నియామకాలు చేపడితే వారి కాలంలో జరగని పనులు మా ప్రభుత్వంలో ఎట్లా జరుగుతాయని కోర్టు కేసులతో అనేక ఇబ్బందులు సృష్టించారని అయినా వాటన్నిటిని ఎదుర్కొని, కోర్టుల్లో వాదించి గెలిచి నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత  అన్నారు.  ఈ నియామక ఉత్తర్వులు తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలు అన్నారు. బాధ్యతతో సమాజ సేవ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యువతకు అద్భుతమైన అవకాశం కల్పించింది అని వివరించారు. ఆర్డర్ పొందిన నాటి నుంచి రిటైర్మెంట్ వరకు సంకల్పంతో రాష్ట్రానికి సేవలు అందించాలి అన్నారు. 2047 వరకు తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి చెందాలని ప్రపంచంతో పోటీ పడాలని రూపాయి రూపాయి పోగేసి రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. నియామక పత్రాలు పొందిన అధికారుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page