– విద్యుత్ సంఘాల డైరీ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రజల జీవితాలకు సంబంధించిన వెలుగులు అందించడమే కాకుండా ఉద్యోగుల కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంలో పవర్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు అందరికీ ఆయన నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాభవన్‌లో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, 1104 విద్యుత్ సంఘాల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం ఉదయం విద్యుత్ ఉద్యోగులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ప్రసంగించారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు, జనరల్ సెక్రటరీ సదానందం, నాయకులు జనప్రియ వెంకటేశ్వర్లు, సాంబయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. 1104 యూనియన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




