అడుగులో అడుగు వేసి.. అధికార పీఠం వరకు..

– భట్టి పీపుల్స్ మార్కు మూడేళ్లు
– ప్రజా సమస్యలే దిక్సూచిగా సాగిన పాదయాత్ర
– పాదయాత్ర జ్ఞాపకాలు, ప్రజా పాలన లక్ష్యాలతో డిప్యూటీ సీఎం భట్టి  సందేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: తెలంగాణలో ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టి న ‘పీపుల్స్ మా ర్స్’ పాదయా త్రకు మూడేళ్లు పూర్తైన సంద ర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భావోద్వేగ సందేశం విడుదల చేశారు. 2023 మార్చి 16న ప్రారంభమైన ఈ పాద యాత్ర, అదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం వరకు సుమారు 1,364 కిలోమీటర్ల మేర సాగింది. మండుతున్న ఎండలు, శారీరక క ష్ఠాలను లెక్కచేయకుండా ప్రజల సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో ఈ యాత్ర కొనసా గిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రజలే నా శక్తి 

పాదయాత్రలో ఎదురైన అనుభవాలను ప్రస్తా విస్తూ.. పల్లెల్లో తల్లులు పెట్టిన ఆహారం, రైతు ల కష్టాలను ప్రతిబింబించిన కరచా ల సం, నిరుద్యోగ యువతలో కనిపించిన ఆశ లు, ఇవన్నీ తనలో సంకల్పాన్ని మరింత బలపరి చాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఆనాడు. పాదాలకు బొబ్బలు ఎక్కినా, శరీరం అలసిపోయిన సన్ను ముందుకు నడిపించింది మీ ఆత్మీయత మాత్రమేని పేర్కొన్నారు. పల్లె పల్లెనా తల్లులు ఆశీర్వదిస్తూ గోరుముద్దలు పెట్టారని, చెమట చిందిస్తూ పొలాల్లో కనిపించిన రైతన్న కరచాలనంచేశారని గుర్తుచేసుకున్నారు. ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ బిడ్డల చూపులు నాలో నిరంతరం ఒకే సంకల్పాన్ని రగిలించాయి. ఎలాగైనా మన తెలంగాణలో సామాన్యుడి రాజ్యం రావాలని, పేదవాడి కళ్ల ల్లో ఆనందం చూడాలని అహర్నిశలూ శ్రమిం చానని తెలిపారు. ఈ రోజు ప్రజలందరి ఆశీ స్సులతో మన ప్రజా ప్రభుత్వం కొలువుదీరిం ది. నేను నాడు పాదయాత్రలో ఏ కష్టాలనైతే కళ్లారా చూశానో, ఏ సమస్యలనైతే నా డైరీలో రాసుకున్నానో వాటన్నింటికీ పరిష్కారం చూపడమే నేడు తన ఏకైక లక్ష్యమని, మన వసరులు మనకే దక్కాలి, మన ఆదాయం మన పేదలకే చేరాలి. తెలంగాణను ప్రపంచం తో పోటీ పడేలా తీర్చిదిద్దుతూనే, అట్టడుగున ఉన్న ప్రతి మనిషికి సంక్షేమ ఫలాలు అందిం చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నాడు ఎండనక, వాసనక నా అడుగులో అడుగు వేసి, ఈ పీపుల్స్ మార్ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు. నాయకుడికి, అభిమానికి భటి విక్రమార్మ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిన నమ్మకం, నాపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనివని మనం మొదలుపెట్టిన ఈ సంక్షేమ ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని, ప్రజా సేవలో తన ఆఖరి శ్వాస వరకు ప్రజలు, కార్యకర్తల వెంటనే ఉంటానని స్పస్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *