హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శనివారం ఉదయం పాండిచ్చేరికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ వైద్య లింగం, మాజీ మంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామినాథంలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందరá్భంగా పాండిచ్చేరిలో సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. మొత్తం 23 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుండగా ప్రస్తుతం శనివారానికి 21వ నియోజకవర్గమైన ఏంబులంకు చేరుకుంది. సాయంత్రం డిప్యూటీ సీఎం పాదయాత్రలో పాల్గొని అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





