– భారీ వర్షాలతో తావి నదికి వరదలు
న్యూదిల్లీ, ఆగస్ట్ 25: భారీ వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే పాకిస్థాన్‌లో వరదలు సంభవించే ముప్పు ఉంది. దీంతో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ పాక్ అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆ దేశంలోని జియో న్యూస్, దిన్యూస్ ఇంటర్నేషనల్ వంటి మీడియాల్లో కథనాలు వచ్చాయి. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వరదలపై దాయాదిని న్యూదిల్లీ అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని మీడియా కథనాలను ఉటంకిస్తూ ఇరు దేశాల మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిచిపోయినప్పటికీ వరదలపై పాక్ ను భారత్ అప్రమత్తం చేసి మానవత్వాన్ని చాటుకుంది. అంతకుముందు ఇలాంటి సమాచారాన్ని సింధూ నది జలాల ఒప్పంద కమిషనర్ పంచుకునేవారు. ఇప్పుడు దౌత్య కార్యాలయం పాక్‌ను అప్రమత్తం చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. భారత్ అందించిన సమాచారంతో పాక్ యంత్రాంగం తమ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపాయి. అయితే, దీనిపై భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దాయాదిపై తీవ్రంగా మండిపడిన భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960 నుంచి ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తన్నాయి. దీంతో వరదలు సంభవించాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 780 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





