రూ.351కోట్లతో భద్రాద్రి ఆల‌య‌ విస్తరణ పనులు

– తొలి దశ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : భద్రాచలం రామాలయం అభివృద్దికి  ముఖ్యమంత్రి రేవంత్‌రడ్డి రూ.586 కోట్లు ప్రకటించారు.అందులో మొదటి విడతగా రూ.351 కోట్లతో పనులు ప్రారంభించేందుకు శ్రీ సీతారాముల కల్యాణానికి శుక్ర‌వారం భద్రాచలం  వచ్చిన సందర్బంలో భూమి పూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సతీసమేతంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భద్రాచలం ఆలలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. నీరు, అన్న ప్రసాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, న్యాయమూర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్, ఎండోమెంట్ కమీషనర్ హన్మంత రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓ బి.రాహుల్, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *