భద్రాద్రి జిల్లా మాంచెస్టర్‌ ఆఫ్‌ ‌తెలంగాణ

పేదోడి సంక్షేమమే లక్ష్యం
జండా ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 ‌బ్రిటీష్‌ ‌పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన వేలాది మంది అమరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని, మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన పోరు బాటలో నేల కొరిగిన అమరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం పట్టణం ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జండా ఆవిష్కరించారు. అంతరం మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని, నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ రాముడు సీతమ్మ తల్లితో కలిసి త్రేతాయుగంలో నడయాడిన పుణ్య భూమి సిరులు తల్లి సింగరేణి పుట్టినిల్లు జాతికి వెలుగులు నింపే పాల్వంచ కేటీపీఎస్‌, ‌దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కీలకమైన హెవీ వాటర్‌ ‌ప్లాంట దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఐటీసీ పేపర్‌ ‌కర్మాగారం, గోదారమ్మ కిన్నెరసాని పరవళ్ళతో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అత్యధిక అటవీ విస్తీర్ణంతో దేశ మూలు ఆదివాసులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామికంగా మాంచెస్టర్‌ ఆఫ్‌ ‌తెలంగాణగా ఏకో టూరిజం కేరాఫ్‌గా నిలిచిందన్నారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊది రణం చేసిన వీర భూమి కొత్తగూడెం అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రజా పాలనలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో జిల్లా అబివృద్ధి ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా సశ్య శ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును గత ఆగస్ట్ 15‌న సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. పెండింగ్‌ ‌పనుల కోసం సవరించిన అంచనాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. గోదావరి కృష్ణ నదుల అనుసంధానం జిల్లా పారిశ్రామికంగా మాంచెస్టర్‌ ఆఫ్‌ ‌తెలంగాణగా  రాజీవ్‌ ‌లింక్‌ ‌కెనాల్‌ ‌ప్రారంభోత్సవం చేశామని వెల్లడించారు. దేశంలోనే తొలి ఎర్త్ ‌సైన్సెస్‌ ‌యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు, ప్రసిద్ద భద్రాద్రి రామాలయం అబివృద్ధికి సీఎం రూ 34 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.గోదావరి వరదలకు అడ్డుకట్టగా కరకట్ట విస్తరణ పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం వద్ద గోదావరి పై రెండో బ్రిడ్జి ప్రారంభోత్సవం చేశామని, పాండురంగాపురం నుంచి మల్కాన్‌గిరి వరకు రైల్వే లైన్‌ ‌మంజూరు కాగా భక్తులు సౌకర్యార్థం సారపాక వరకు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాము అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *