15 నుండి భద్రాచలం స్వామివారి కల్యాణ సెక్టార్ టికెట్లు

– నేరుగా, అన్లైన్ ద్వారా విక్రయం

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి క్షేత్రము నందు 19వతేదీ నుండి ఏప్రియల్ 02వ తేదీ వరకు జరుగునున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవములలో భాగంగా 27వతేదీన “శ్రీస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవము” మరియు 8.282 “శ్రీస్వామి వారి పట్టాభిషేక మహోత్సవము”లను వీక్షించగోరు భక్తుల సౌకర్యార్ధమై, నేరుగా మరియు ఆన్లైన్ ద్వారా సెక్టార్ టిక్కెట్లు ముందస్తుగా పొందుటకు అవకాశం కల్పించబడినట్లు దేవస్థానం ఇది దామోదర్రావు తెలిపారు. సెక్టార్ టిక్కెట్లు రుసుములు కళ్యాణోత్సవమునకు రూ॥7,500/- (ఉభయదాతలు), రూ॥2,500/-, .2,000/-, 1,000/-, 300/- 150/- ລ້ పట్టాభిషేకమునకు రూ. 1,500/-, 500/-, 100/-15వతేదీ నుండి నేరుగా సెక్టార్ టిక్కెట్లు విక్రయించబడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.(1) ఆలయము వద్ద గల మెయిన్ టిక్కెట్ కౌంటర్, (2) తానీషా కళ్యాణ మండపము (సి.ఆర్.ఓ.), (3) బ్రిడ్జి పాయింట్ సి.ఆర్.ఓ., (4)సబ్ కలెక్టర్, భద్రాచలం వారి కార్యాలయం. మరియు ఇట్టి ఉత్సవములకుగాను విచ్చేయుటకు సావకాశం లేని భక్తుల సౌకర్యార్థమై గత సం||ల వలె, పరోక్షముగా భక్తులు వారి గోత్ర నామములతో కళ్యాణం జరిపించుకొనుటకుగాను పరోక్ష సేవలు రూ.5,000/-లు మరియు రూ॥1,116/-లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచబడినట్లు తెలిపారు. పై తెలిపిన విధముగా సెక్టార్ టిక్కెట్స్ మరియు పరోక్ష సేవలను టెంపుల్ వెబ్సైట్: https://bhadradritemple.telangana.gov.in w 7 ລ້ ລ້ బుకింగ్ చేసుకొను సదుపాయము కల్పించారు. ఆన్లైన్ నందు సెక్టార్ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు 20వతేదీ ఉదయం 11గంటలనుండి 27 ఉదయం 6 గంటలవరకు దేవస్థాన తానీషా కళ్యాణ మండపం కార్యాలయము నందు (సి.ఆర్.ఓ.) వారి ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపి ఒరిజినల్ టిక్కెట్లను పొందవచ్చును.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *