– మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు త్రొక్కుతుంది. శుక్రవారం సాయంత్రానికి 44 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరుకుంది. ఇది మరింత పెరిగా అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం వరకు 48 అడుగులు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక కు దగ్గరగా ప్రవహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు ప్రమాద స్థాయిని మించి వరద నీరు ఉండటంతో ఆ నీటిని క్రింది భాగానికి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. శ్రీరామ్ సాగర్ కాలేశ్వరం సమ్మక్క బ్యారేజ్ గేట్లు వదిలి వరద నీటిని క్రింది భాగానికి విడుదల చేయడంతో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఉపనదులైన ప్రాణహిత ఇంద్రావతి నదులు పొంగి ప్రవహించడంతో నీటి ప్రవాహం వేగం పెరిగింది. శబరి నది కూడా వేగంగా ప్రవహించడంతో గోదావరి క్రింది భాగానికి వెళ్లేందుకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. శబరి నది పోటు వేయటంతో గోదావరి క్రింది భాగానికి వేగంగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగే అవకాశం ఉంది. 50 అడుగులు దాటినట్లయితే రహదారులు జలదిగ్బంధంలో ఉంటాయి. దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం ప్రాంతాలకు భద్రాచలం నుండి రాకపోకలు స్తంభించిపోతాయి. అలాగే బూర్గంపాడు వద్ద కూడా వరద నీరు రోడ్డు పైకి చేరుతుంది దీని కారణంగా బూర్గంపాడుకు రాకపోకలు నిలిచిపోతాయి. అంతేకాకుండా మణుగూరు పినపాక ప్రాంతాల రోడ్లపైకి వరద నీరు చేరుకుంటుంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక కు చేరుకొని మూడోసారి. ఆగస్టు నెలలో వరద ప్రభావం ఉంటుందని ముందుగానే ప్రజలు ఊహించారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వస్తుంది. గోదావరి నీటిమట్టం గంటకు వేగంగా పెరుగుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





