బెట్టింగ్‌ ‌యాప్స్ ‌కేసు

– సోనూసూద్‌ ‌సహా ఇద్దరు క్రికెట‌ర్ల‌కు ఈడీ సమన్లు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌16: ‌మనీలాండరింగ్‌ ‌కేసులో నటుడు సోనూసూద్‌ ‌సహా ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 22న మాజీ క్రికెటర్‌ ‌రాబిన్‌ ఉతప్ప, 23న యువరాజ్‌ ‌సింగ్‌, 24‌న సోనూసూద్‌ ‌విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించింది. నిషేధిత ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌యాప్‌ ‌లావాదేవీల్లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ ఉతప్పను ప్రశ్నించనుంది. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు మాజీ క్రికెటర్లకు సమన్లు అందాయి. మాజీ క్రికెటర్లు సురేశ్‌ ‌రైనా, శిఖర్‌ ‌ధావన్‌లను ఇటీవలే ఈడీ ప్రశ్నించింది. ఇదే కేసులో టీఎంసీ మాజీ ఎంపీ, నటి మిమి చక్రవర్తిని ఈడీ సోమవారం విచారించి ఆమె వాగ్మూలం నమోదు చేసింది.  బెంగాలీ నటుడు అంకుశ్‌ ‌హజ్రా మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. నటి ఊర్వశీ రౌతేలా కూడా బెట్టింగ్‌ ‌యాప్‌నకు బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు కూడా నోటీసులు వెళ్లాయి. అక్రమ బెట్టింగ్‌ ‌యాప్‌లు అనేకమందిని లూటీ చేసినట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పెట్టుబడిదారులు రూ.కోట్లు దండుకొని పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది. వెబ్‌సైట్‌ ‌ప్రకారం గత 18 ఏళ్లుగా ఈ కంపెనీ బెట్టింగ్‌ ‌కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్పోర్టస్ ఈవెంట్లపై పందెం కాస్తే ఎక్కువ మొత్తం గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తోంది. 70 భాషల్లో ఈ యాప్‌ ఉం‌డటం గమనార్హం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *