– ఈడీ విచారణకు హాజరైన సోనూసూద్
న్యూదిల్లీ,సెప్టెంబర్24: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో విచారణకు రావాలని ఈడీ గతంలో సోనూ సూద్‌కి సమన్లు జారీ చేసింది. అయితే కొన్నిరోజులుగా పంజాబ్‌లోనే ఉండి వరద బాధితులకు అండగా నిలిచిన సోనూ తాజాగా దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణలో భాగంగా.. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వాటితో సోనూ సూద్‌కి ఉన్న సంబంధాలు ప్రచారానికి తీసుకున్న డబ్బుల గురించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ఈడీ విచారించింది. ఇటీవల సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, నటి మంచు లఁ్‌మి, నటుడు విజయ్ దేవరకొండ, రానా కూడా విచారణకు హాజరయ్యారు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, నల్లధనం లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పలువురు సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





