– అందుకున్న పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్, జలమండలి ఎండీ
న్యూదిల్లీ, నవంబర్ 18: దేశవ్యాప్తంగా జరిగిన జల్ సంచయి జన బాగీదారి 1.0 కార్యక్రమంలో రాష్ట్రం బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకుని మరో మైలురాయిని సాధించింది. దేశంలోనే నంబర్-1 రాష్ట్రంగా నిలవడంతోపాటు, సౌత్ జోన్‌లో అన్ని అవార్డులను స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 8 జిల్లాలు 1వ, 2వ, 3వ స్థానాలను సాధించాయి. తమ ర్యాంకుల ఆధారంగా ప్రతి జిల్లా వరుసగా రూ.2 కోట్లు, రూ.కోటి, రూ.50 లక్షల నగదు బహుమతులను గెలుచుకొని సత్తా చాటింది. ఈ నేపద్యంలో రాష్ట్రస్థాయి అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జి.సృజన అందుకున్నారు.జిల్లాల విభాగంలో అవార్డును జిల్లా కలెక్టర్లు, డిఆర్‌డివోలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ విశిష్ట విజయంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అభినందనలు తెలిపారు. అధికారుల కృషి, సమన్వయం, నిబద్ధత మన రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో మరింత గర్వించదగిన స్థాయికి తీసుకెళ్లాయనీ పేర్కొన్నారు. రాష్ట్రం తరఫున రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఇది మంత్రి సీతక్క మార్గదర్శకంలో సిబ్బంది సమష్టి కృషికి దక్కిన ఫలితం అని డైరెక్టర్ సృజన పేర్కొన్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జల్ సంచయ్ జన భాగిదారి అవార్డు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టాప్ మునిసిపల్ కార్పొరేషన్ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినందుకు ఈ అవార్డ్ లభించింది. ఇందులో భాగంగా నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




