డాక్టర్ అనితా రెడ్డికి బెస్ట్ కన్స్యూమర్ లీడర్ అవార్డు

హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ అండ్ అడ్వైజర్, సివిల్ సప్లయిస్ డిపార్టుమెంట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ డాక్టర్ కరుకాల అనితారెడ్డి బెస్ట్ కన్స్యూమర్ లీడర్ సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో పౌండర్ చైర్మన్ డాక్టర్ రామానుజ స్వామి ఈ అవార్డును అందజేశారు. కన్స్యూమర్ రైట్స్ అండ్ యాక్టుపై ఎన్నో అవగాహన కార్యక్రమాలను గ్రామస్ధాయి నుండి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించినందుకు, మోసపోయిన ప్రజలకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చేసినందుకు ఈ అవార్డుకు డాక్టర్ అనితా రెడ్డిని ఎంపిక చేశామని, ఆమె సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని డాక్టర్ రామానుజ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అంటే మోసాలను తగ్గించడమేనన్నారు. సమాజ సేవ చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని, అది తన బాధ్యత కూడా అని అన్నారు. నాణ్యత, సరైన ధరకు వస్తువులను పొందటం మన హక్కు అని, అందుకు చట్టాల పట్ల అవగాహనను తాము కల్పిస్తున్నామని చెప్పారు. బెస్ట్ లీడర్ సర్టిఫికెట్ అవార్డు స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *