ఆది కర్మయోగి అభియాన్‌ అద్భుతం

– ఈ పథకం ద్వారా గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపాలి
– అభివృద్ధి ప్రణాళికల్లో గిరిజనులకు భాగస్వామ్యం
– ట్రైకార్‌ ‌చైర్మన్‌ ‌తేజావత్‌ ‌బెల్లయ్యనాయక్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ‌దేశంలోని ఆదివాసులందరికీ పూర్తిస్థాయి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించేందుకు భారత ప్రభుత్వం గత సంవత్సరం ‘ఆది కర్మయోగి అభియాన్‌ ‌పథకాన్ని ప్రవేశపెట్టింది.  అభినందనీయమైన ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌, ఇతర గిరిజన సంరక్షక, సంక్షేమ చట్టాలను పూర్తిగా అవగాహన చేసుకుని గిరిజన క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేయడం ద్వారా వారిలో పేదరికాన్ని రూపుమాపాలని, ఇలా గిరిజనులకు సాయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషించాలని ట్రైకార్‌ ‌ఛైర్మన్‌ ‌డా. తేజావత్‌ ‌బెల్లయ్య నాయక్‌ అన్నారు. మంగళవారం గిరిజన సంక్షేమశాఖకు చెందిన గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమం ‘రాష్ట్ర ప్రాసెస్‌ ‌ల్యాబ్‌’ ‌పేరిట ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభు నాయర్‌ ‌వర్చువల్‌ ‌కాన్ఫరెన్స్ ‌ద్వారా పాల్గొని మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న అధికారులు గిరిజన సంక్షేమ శాఖల అసలైన ప్రతినిధులు, నాయకులు అని, వీరు ఒక్కొక్క గిరిజనులతో సంభాషించి వారి సమస్యల పట్ల అవగాహన పెంచుకొని, రానున్న ఐదేళ్ళకు ప్రణాళిక రూపొందించి, గిరిజనులను కూడా ఆయా ప్రణాళికల అమలులో భాగస్వాములను చేసి సింగిల్‌ ‌విండో రిజిస్టర్‌ ‌ద్వారా గిరిజనుల అన్ని సమస్యలను పరిష్కరించాలని మార్గ నిర్దేశనం చేశారు. కార్యక్రమానికి అతిధిగా హాజరైన గిరిజన వ్యవహారాల శాఖ సంచాలకులు డా.శివానంద్‌ ఈ ‌కార్యక్రమ రూపకల్పన నేపథ్యం, లక్ష్యాల గురించి, వాటి అమలు విధానం, డెడ్‌ ‌లైన్స్ ‌గురించి వివరించారు.  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గౌరవ అతిధిగా పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్‌-‌కార్యదర్శి డా•• అలగు వర్షిణి మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న అధికారులందరూ ఈ పథకాన్ని ఒక టీమ్‌ ‌వర్క్ ‌లాగా ముందుకు తీసుకెళ్ళాలని, గిరిజనులతో స్నేహంగా మెలగుతూ వారి పూర్తిస్థాయి అభివృద్ధికి  కృషి చేయాలన్నారు.  కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న విట్టా సర్వేశ్వర్‌ ‌రెడ్డి కార్యక్రమం గురించి ప్రారంభోపన్యాసం చేశారు. కార్యక్రమాన్ని సమన్వయం చేసిన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ సంచాలకులు డాక్టర్‌ ‌వి. సముజ్వల ముగింపు వాక్యాలు పలికారు. కార్యక్రమంలో నాలెడ్జ్ ‌పార్ట్నర్స్ ‌బీఆర్‌ఎల్‌ఎఫ్‌ ‌ప్రతినిధులు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *