కాళేశ్వ‌రంపై చర్చకు రావాలి

~ కేసీఆర్‌ను డిమాండ్ చేసిన ప్రభుత్వ విప్‌ ‌ఐలయ్య

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 29: ‌కాళేశ్వరం కమిటి నివేదికను అసెంబ్లీలో పెడతామని ప్రభుత్వ విప్‌ ‌బీర్ల ఐలయ్య తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్‌ అసెంబ్లీకి రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలకు కెసిఆర్‌ ‌సమాధానం చెప్పుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌ ‌సభలో మాట్లాడతానంటే తమ సమయం కూడా ఇస్తామని, బిసి రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్‌ ‌చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలియజేశారు. మంచి పాలన అందిస్తున్నందుకు మమ్మల్ని తిడతారా అని ఐలయ్య ప్రశ్నించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *