ఉగ్రవాదులను ఉసిగొల్పితే చావుదెబ్బ కొడతాం
ఉగ్రవాదుల మాటున అణు బెదిరింపులను సహించం
ఆపరేషన్ సిందూర్ విజయవంతం
పాక్‌లో ఉగ్రవాదులను చావుదెబ్బకొట్టాం
ఉగ్రతండాలను తుదముట్టించాం
ఉగ్రవాదులకు అండగా నిలిస్తే…ఇలాగే సమాధానం ఇస్తాం
త్రివిధ దళాలు ఎప్పుడూ దాడులకు సిద్దమే
మన సైనిక శక్తిని చాటిన దళాలకు సెల్యూట్
మనసత్తా ఏమిటో ప్రపంచం కూడా చూసింది
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఉద్వేగ పూరిత ప్రసంగం
పాకిస్తాన్ కాచుకో..ఇకముందు ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నామరూపాల్లేకుండా తుదముట్టిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్‌ను తాత్కాలికంగానే పక్కన పెట్టాం..పూర్తిగా ఆపేయలేదని, ఎలాంటి టెర్రర్ అటాక్ జరిగినా ఇక దానిని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ ఘాటుగా హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ భూభాగంలో టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశామని ప్రకటించారు. అలాగే మన సత్తా ఏమిటో ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్థాన్‌కు చాటాని అన్నారు. ఈ క్రమంలో సైనిక దళాలకు ఆయన సెల్యూట్ చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే… టెర్రరిజం, ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఉంటుందన్నారు. ఇందులో మూడో వ్యక్తి జోక్యాన్ని కూడా సహించబోమన్నారు. ఆపరేషన్ సిందూర్ తరవాత ప్రధాని మోదీ సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. టెర్రరిజం, భారత్‌పై దాడులు, అమాయక ప్రజల ఉచకోతలను ప్రధానంగా ప్రస్తావించారు. పహల్‌గామ్ ఊచకోత వ్యక్తిగతంగా తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. ప్రజలంతా ఒక్కటిగా ఈ ఘటనపై శాస్తి జరగాలని కోరుకున్నారని, ప్రజల ఆకాంక్షల మేరకు భారత రక్షణ దళాలు వందమంది టెర్రరిస్టులను సమూలంగా సర్వనాశనం చేశాయని అన్నారు. ఉగ్రవాదుల తండాలను ధ్వంసం చేశాయని, ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించారు. భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ప్రకటించారు. గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని, సంయమనాన్ని చూస్తున్నాం. నిఘా వర్గాల సామర్థం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం
చూసింది. భారత రక్షణ దళాలు చూసిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికం. పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరి అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడితో దేశమంతా నివ్వెర పోయింది. ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం జ్వలించింది. పౌరులు, పార్టీలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. భారతీయ మహిళల నుదిటిపై సిందూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సిందూర్. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి. బహావల్‌పుర్, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని భారత్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు ఏం చేస్తుందో భారత్ చెప్పింది. పాక్ గర్వంగా చెప్పుకొనే మిసైళ్లను ధ్వంసం చేశాం. పాకిస్థాన్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్ తీసుకొచ్చింది. భారత్ చర్యలకు బెంబేలేత్తిపోయిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. పాక్ డీజీఎంవో కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారని అన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కాళ్ల బేరానికి వచ్చారని అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా పాక్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో భారత్ తుడిచిపెట్టింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రతండాలను తుదముట్టించింది. భారత్ దెబ్బకు పాక్ నిరాశనిస్ప•హల్లో కూరుకుపోయింది. అచేతనావస్థకు చేరుకుంది. దాడులతో ఏటూ పాలుపోని పాక్.. భారత్‌లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగింది. పాక్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. పాక్ రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు ఛిన్నాభిన్నం చేశాయి. పాక్ గర్వంగా చెప్పుఒకనే మిసైళ్లు, రక్షణ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత్ మిసైళ్లు విధ్వంసం సృస్టించాయి. పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి తిరగలేని స్థితిని భారత్ కల్పించంది. ఇందులో భారత స్వయం సమృద్దికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉందన్నారు. ప్రపంచానికి తాము ఇదే చెప్పదల్చుకున్నామని అన్నారు. ఇకముందు టెర్రరిజంతో బ్లాకమెయిల్ చేస్తే ఊరుకునేది లేదన్నారు. పాక్ కూడా టెర్రిజానన్ని పక్కన పెట్టకుంటే అదే ఓనాడు ఆదేశాన్ని కబళిస్తుందని కూడా హెచ్చరించారు. ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా భారత్ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్జికల్ ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సింధూర్.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయి. భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయి. పాకిస్థాన్ అణు బ్లాక్‌మెయిలింగ్ ఇక సహించేది లేదు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుందని ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు గట్టిగా హెచ్చరికలు పంపారు. ఇకపోతే భవిష్యత్‌లో పాక్‌తో టెర్రిరిజం, పివోకేలపైపే చర్చలు సాగుతాయన్నారు. అలాగే రక్తం, నీళ్లు ఒకేచోట్ ప్రవహించవన్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం కలసి సాగలేవన్నారు. భారత ప్రజల రక్షణ విషయంలో రాజీలేదన్నారు. ఈరోజు బుద్ద పూర్ణిమ అంటూ..శాంతితో పాటు శక్తి కూడా కలసి ఉంటుందన్నారు. ఈ యుగం ఉగ్రవాదానికి చోటు లేదన్నారు. అలాగే యుద్దాలకు కూడా వర్తించదన్నారు. శాంతిని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని, అలాగని చేతులు ముడుచుకుని కూర్చోదన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు- ప్రధాని మోదీ ప్రకటించారు. అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశం వీరత్వాన్ని చాటుకుందన్నారు. మన మహిళల సింధూరాన్ని దూరం చేస్తే.. ఏమవుతుందో చూపించామని చెప్పారు. ఉగ్రవాదులపై దాడులకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని గుర్తు చేశారు. సైన్యం చేసిన దాడికి పాకిస్థాన్ సైతం నివ్వెర పోయిందన్నారు. పాకిస్థాన్ నిఘా, సాంకేతికత భారత్ ముందు తేలిపోయిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులను నియంత్రించాల్సిన పాక్ మనపై ఎదురు దాడి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ మన స్కూల్స్, ఆస్పత్రులు, గురుద్వారాలను టార్గెట్ చేసిందని వివరించారు. పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైల్స్ కూల్చివేశామని ప్రధాని మోదీ తెలిపారు. పాక్ మిస్సైల్స్ భారత్‌లోకి రాలేకపోయాయన్నారు. మనం మాత్రం పాకిస్థాన్ గుండెల్లో బాంబులు పేల్చామని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌లను సైతం ధ్వంసం చేశామన్నారు. మన దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడిపోయిందని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. భారత్‌ను ఎదుర్కో లేక ప్రపంచ దేశాల సాయాన్ని పాకిస్థాన్ కోరిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.
పాకిస్థాన్ చర్యలను బట్టే మన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్దా తిప్పికొడతామన్నారు. పాక్ అణు బ్లాక్ మెయిలింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు. త్రివిధ దళాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం అంతానికి అన్నిరకాల వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పాక్ తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఆ దేశాన్నిహెచ్చరించారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
———————





