జెఈఈ మెయిన్ లో మెరిసిన బీసీ విద్యార్థులు

– పరీక్షకు 318మంది విద్యార్థుల హాజ‌రు
– 90 పర్సెంటైల్‌పైగా సాధించిన ఐదుగురు విద్యార్థులు
– 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించిన 28మంది విద్యార్థులు
– విద్యార్థులకు మంత్రి పొన్నం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా మొదటి విడతలో జరిగిన జెఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు 318మంది హాజరు కాగా వారిలో ఐదుగురు విద్యార్థులు 90 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించారు. మరో 28మంది విద్యార్థులు 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించారు. బాలికల విభాగంలో ఎ.నిత్య (92.19), సిహెచ్.గాయత్రి (91.50), ఎం.సహస్ర (87.69), పి.చరిత(86.20), ఎం.స్నేహ(85.09) పర్సంటైల్ సాధించారు. బాలుర విభాగంలో ఎం.నరేందర్, Y(91.58), ఆర్.కౌశిక్ (91.25), బి.మల్లేష్(90.50), బి.హరీష్ (89.19), డి.రోహన్(88.05) పర్సంటైల్ సాధించారు. గతంలో రెండు సీఓఈలలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తుండగా తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పది సీఓఈలను ఏర్పాటు చేయడమే కాÅ£ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇస్తున్నదని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీ పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించారని, రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని రవాణా,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. అత్యుత్తమ ప్రతిభను చూపిన విద్యార్థినీవిద్యార్థులను, బోధనా సిబ్బందిని మంత్రి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ.శ్రీధర్, t, ఎంజెపి సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *