BC Reservations: బీసీ రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడుతాం

– కిషన్‌ ‌రెడ్డి లాంటి వారి కుట్రలు సాగనివ్వం
– మీడియాతోమంత్రి పొన్నం ప్రభాకర్‌

‌న్యూదిల్లీ, ఆగస్ట్ 7: ‌బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం తుదివరకు పోరాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (central Minister Kishan Reddy) లాంటి వారి కుట్రలను సాగనివ్వమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచిందని ఎద్దేవా చేశారు. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లోబీసీలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. శాసనసభలో బీసీ బిల్లుపై తీర్మానం సందర్భంలో కిషన్‌రెడ్డి దానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిఉంటే ఆరోజే చర్చ జరిగేది. కానీ ఆ బిల్లు చట్టం రూపంలో మారి గవర్నర్‌ ఆమోదంతో దిల్లీకి వచ్చిన తర్వాత రు ముస్లింల పేరుతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. వారికి రిజర్వేషన్లు ఇప్పుడే కొత్తగా ఇవ్వడం లేదన్నారు. మిమ్మల్ని బహిరంగ చర్చకు కూడా ఆహ్వానించ దల్చుకున్నా. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్‌ ‌నుంచి జంతర్‌ ‌మంతర్‌ ‌ధర్నా వరకు మేం బాధ్యతగా ఉన్నాం అని పొన్నం తెలిపారు. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బిసిలు బిజెపిని తిరస్కరించారని తెలిపారు. బిజెపి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమని అన్నారు. లోక్‌ ‌సభ ఎన్నికల్లో బిజెపి చావుతప్పి కన్నులొట్ట అన్నట్లుగా గెలిచిందని విమర్శించారు. బిసి రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడుతామని సవాల్‌ ‌విసిరారు. బిసి రిజర్వేషన్లు పెంచపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. బీసీ కోటాను అడ్డుకునే కిషన్‌ ‌రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.  కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌ ‌రెడ్డి బీసీలపై మాట్లాడేమాటలు కరెక్ట్ ‌కాదన్నారు. బీసీ కోటా ఇవ్వడం కుదరదని కిషన్‌ ‌రెడ్డి లేఖ ఇవ్వాలన్నారు.  బీసీ కోటాకు బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు.  బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉందన్నారు. సమగ్ర కులగణ సర్వేను పకడ్భందీగా నిర్వహించామని చెప్పారు. అశాస్త్రీయమైన సర్వే చేసి, బీసీల సంఖ్యను తగ్గించారని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  ఆ తర్వాత దీనికి 10 శాతం ముస్లింలను చేర్చి.. బీసీలను మోసం చేస్తున్నారని అన్నారు . తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు కేవలం 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అందుతాయని కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఇది బీసీలను మోసం చేయడమేనని చెప్పారు.  ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని బీజేపీ అంగీకరించదన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తే, బీసీ రిజర్వేషన్ల బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు కిషన్‌ ‌రెడ్డి.
బీసీ రిజర్వేషన్లపై హా ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీనే వాటిని అమలు చేయాలని  కిషన్‌రెడ్డి అన్నారు. అది కాకుండా బట్టకాల్చి బీజేపీపై వేస్తామంటే ఊరుకోబోమని మండిపడ్డారు. దిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద కాంగ్రెస్‌ ‌పార్టీ పెట్టుకున్న సభ.. గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని  ఎద్దేవా చేశారు. సీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ‌హా ఇచ్చింది..దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీదే. అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టిసారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప.. బట్టకాల్చి బీజేపీ ద వేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *