– బీసీ కుటుంబంపై దాడి అంశంపై
నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జైప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈనెల 19న మల్లన్న జాతర సందర్భంగా వెనుకబడిన తరగతులకు చెందిన గణేష్, మోనికపై దాడి, అనంతరం రెండు నెలల శిశువు మరణించినట్లు సమాచారం వచ్చింది. కమిషన్ చైర్మన్, సభ్యులు, మీడియా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో కలిసి జాతర జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్థానిక నిర్వాహకులు తమంతట తామే టికెట్లు ముద్రించి డబ్బులు వసూలు చేసినట్లు ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ మదన్ తెలిపారు జాతరకు ప్రవేశ రుసుము వసూలు విషయంలో బాధితులు, నిర్వాహకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు, మల్లన్న జాతర సందర్భంగా సుమారు ఐదు వేల నుండి పదివేల మంది ప్రజలు హాజరైనట్లు సమాచారం. సరైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా పరిపాలన, పోలీస్ శాఖ, ఎండోమెంట్స్ శాఖల నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆలయం 2018లో ఎండోమెంట్స్ శాఖలో వైడ్ నం: దీ/1179/2018గా నమోదు అయింది. అయితే స్థానిక ఆధిపత్య వర్గాల ప్రతిఘటన కారణంగా మల్లన్న జాతర ఏర్పాట్లలో ఎండోమెంట్స్ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత తీసుకున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్, ఎస్పీలు వివరించారు. కమిషన్ సభ్యులు శిశువు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాధితులతో కమిషన్ చర్చించి ఘటనకు సంబంధించిన నేపథ్యాన్ని తెలుసుకున్నది. బాధితులను కలిసిన తరువాత కమిషన్ జిల్లా కలెక్టర్, ఎస్‌పీతో సమావేశమై ఈ అంశంపై చర్చించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





